News September 16, 2025

GST ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన మదర్ డెయిరీ

image

GST శ్లాబులను సవరించిన నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. లీటర్ పాల ధర ప్రస్తుతం రూ.77 ఉండగా రూ.75కు తగ్గించామని తెలిపింది. నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్స్ రేట్లనూ తగ్గించినట్లు వెల్లడించింది. పాలపై సున్నా, మిగతా ఉత్పత్తుల(పనీర్, బట్టర్, చీజ్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్)పై 5% జీఎస్టీ ఉంటుందని తెలిపింది.

Similar News

News September 16, 2025

దసరా సెలవులు ఎప్పుడంటే?

image

AP: స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మైనారిటీ పాఠశాలలకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు SEP 28 నుంచి OCT 5 వరకు హాలిడేస్ ఉంటాయి. అటు తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.

News September 16, 2025

పెళ్లిపై మరోసారి స్పందించిన జాన్వీ కపూర్

image

తన పెళ్లిపై స్టార్ హీరోయిన్ జాన్వీ మరోసారి స్పందించారు. ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమెకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ‘ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్‌లో ఉన్నట్లు టాక్.

News September 16, 2025

యూసుఫ్ పఠాన్‌‌‌ను ఆక్రమణదారుడిగా పేర్కొన్న హైకోర్టు

image

ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని మాజీ క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్‌‌ను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. అతడిని ఆక్రమణదారుడిగా పేర్కొంది. సెలబ్రిటీలు చట్టానికి అతీతులు కారని చెప్పింది. వడోదరలో ఇంటి పక్కనున్న ఖాళీ స్థలాన్ని యూసుఫ్ ఆక్రమించగా 2012లో సర్కార్ నోటీసులిచ్చింది. తాను, తన సోదరుడు క్రికెటర్లమని, సెక్యూరిటీ దృష్ట్యా ఆ భూమిని కొనేందుకు అనుమతించాలని కోరగా హైకోర్టు తాజాగా తిరస్కరించింది.