News September 20, 2025
GST ఎఫెక్ట్.. సిలిండర్ ధర తగ్గుతుందా?

ఈనెల 22 నుంచి GST కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో నిత్యావసరాలతో పాటు చాలా వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. అయితే నిత్యం వాడే వంటగ్యాస్ సిలిండర్ రేటు కూడా తగ్గుతుందా అనే సందేహం సామాన్యుల్లో నెలకొంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్‌పై 5%, కమర్షియల్ సిలిండర్‌పై 18% GST అమల్లో ఉంది. ఇకపైనా ఇదే కొనసాగనుంది. దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.905 ఉంది.
Similar News
News September 20, 2025
మైథాలజీ క్విజ్ – 11 సమాధానాలు

1. రామాయణంలో తాటకి భర్త ‘సుందుడు’. వీళ్లిద్దరి పుత్రుడే ‘మారీచుడు’.
2. మహాభారతంలో శంతనుడి మొదటి భార్య ‘గంగ’. వీళ్లిద్దరూ భీష్ముడి తల్లిదండ్రులు.
3. సరస్వతీ దేవి వాహనం ‘హంస’.
4. పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశంలో ఉంది.
5. దీపావళి సందర్భంగా ‘లక్ష్మీ దేవి’ని పూజిస్తారు.
<<-se>>#mythologyquiz<<>>
News September 20, 2025
ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు

AP: పలువురు IAS అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీజెన్‌కో ఎండీగా ఎస్.నాగలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేడ్కర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్‌గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కమిషనరుగా అమిలినేని భార్గవ్ తేజ.. కృష్ణా జిల్లా జేసీగా మల్లారపు నవీన్‌ను నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News September 20, 2025
అదృష్టం అంటే ఈమెదే!

MP మహిళ గోల్డర్‌ను అదృష్టం వరించింది. పన్నా జిల్లాలో మైనింగ్ చేసే ఆమెకు 8 వజ్రాలు దొరికాయి. వీటిని జిల్లా డైమండ్ ఆఫీస్‌లో జమ చేయగా త్వరలో వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వజ్రాల్లో అతిపెద్దది 0.79 క్యారెట్ల బరువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వజ్రం విలువ రూ.4-6 లక్షలు పలకొచ్చన్నారు. వజ్రాల గనులకు పన్నా జిల్లా ఫేమస్. ఇక్కడ 8మీ. మైనింగ్ ప్లాట్‌ను ఏడాదికి రూ.200 చొప్పున లీజుకు ఇస్తారు.