News January 1, 2025

DECలో జీఎస్టీ రూ.1.77 లక్షల కోట్లు

image

2024 డిసెంబర్‌లో రూ.1.77 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. నవంబర్‌(రూ.1.82 లక్షల కోట్లు)తో పోలిస్తే వసూళ్లు కాస్త తగ్గాయి. తాజా వసూళ్లలో CGST రూ.32,836 కోట్లు, SGST రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.91,200 కోట్లు, సెస్ రూ.12,300 కోట్లు ఉంది. దేశీయ లావాదేవీలతో రూ.1.32 లక్షల కోట్లు(వృద్ధి 8.4 శాతం), దిగుమతులపై పన్నులతో రూ.44,268 కోట్లు(వృద్ధి 4 శాతం) వచ్చింది.

Similar News

News January 4, 2025

‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌కు విశేష స్పందన

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ అదరగొడుతోంది. యూట్యూబ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఈ ట్రైలర్‌కు ఇప్పటివరకు 180+ మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ఇందులో చరణ్ స్టిల్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, 24 గంటల్లో ఈ మూవీ తెలుగు ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 36.24M వ్యూస్ వచ్చాయి.

News January 4, 2025

ఇండియాలో తొలి బీటా బేబీ ఎవరంటే?

image

ఈ ఏడాది నుంచి కొత్త జనరేషన్ ప్రారంభమైంది. దీనిని జనరేషన్ బీటాగా పిలుస్తున్నారు. 2025-2039 మ‌ధ్య జ‌న్మించే పిల్ల‌ల‌ను జ‌న‌రేష‌న్ బీటాగా ప‌రిగ‌ణిస్తారు. మన దేశంలో తొలి బీటా శిశువు మిజోరం రాష్ట్రంలో జన్మించాడు. అతనికి ఫ్రాంకీ రెమ్రువాత్‌డికా జాడెంగ్ అని పేరు పెట్టారు. జనవరి 1న రాత్రి 12.03కు ఆ బాబుకు రామ్జీర్‌మావీ, జెడ్‌డీ రెమ్రువాత్‌సంగా దంపతులు జన్మనిచ్చారు.

News January 4, 2025

ట్రంప్‌నకు శిక్ష.. అనుభవించాల్సిన అవసరం లేదు!

image

హష్ మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ, కానీ అనుభవించాల్సిన అవసరం లేదని న్యూయార్క్ జడ్జి జ్యుయన్ మర్చన్ తన తీర్పులో తెలిపారు. ప్రొబెషన్‌తో పాటు జరిమానా కూడా చెల్లించకుండా ‘అన్‌కండిషనల్ డిశ్చార్జ్’ అమలు చేస్తామన్నారు. శిక్ష విధించే JAN 10న వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరుకావాలని చెప్పారు. ఈ నెల 20న ట్రంప్ US అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.