News May 4, 2024
రూ.40 కోట్లు కాజేసిన జీఎస్టీ అధికారులు అరెస్ట్

TG: జీఎస్టీ మాటున రూ.40 కోట్లు కాజేసిన వ్యాపారులు, జీఎస్టీ అధికారులను HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు అధికారులు ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ ఉన్నట్లు సృష్టించి జీఎస్టీ రీఫండ్ చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో నల్గొండ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ స్వర్ణ కుమారి, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్లు వేణుగోపాల్, విశ్వకిరణ్, మహిత, డిప్యూటీ స్టేట్ జీఎస్టీ కమిషనర్ వెంకటరమణ ఉన్నారు.
Similar News
News March 18, 2026
నల్గొండ: కారు ఢీకొని ఒడిశా యువకుడి మృతి

పెద్దవూర సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన రామ్ రే (23)ను అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతను కాటన్ మిల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 18, 2026
రేపే జాబ్ క్యాలెండర్.. భారీగా పోస్టులు!

AP: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. 10వేలకు పైగా పోస్టులతో ఈ క్యాలెండర్‌ను మంత్రి లోకేశ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో DSC, జూనియర్ లెక్చరర్ కలిపి 3 వేల పోస్టులు, వర్సిటీల్లో 1,500 అధ్యాపక పోస్టులు, దాదాపు 600 <<19412398>>గ్రూప్-1, 2<<>> ఉద్యోగాలు, 1,000 కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News March 18, 2026
ఏక పంట విధానం.. అన్నదాతకు నష్టం

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


