News December 1, 2024
బీమా ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలి: ఉద్యోగుల సంఘం

పాలసీదారులు చెల్లించే జీవిత బీమా ప్రీమియంలపై GST రద్దు సహా, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచకూడదనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీని కోసం All India Life Insurance Employees Federation ఉద్యమబాట పట్టింది. తమ డిమాండ్లను పార్లమెంటులో లేవనెత్తేలా అన్ని పార్టీల ఎంపీలతో సంఘం ప్రతినిధులు త్వరలో సమావేశం కానున్నారు. అలాగే న్యూ లేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
VIRAL: ఫ్లైట్స్ క్యాన్సిల్.. లగేజీ కోసం తిప్పలు!

400కు పైగా ఇండిగో విమానాలు రద్దవడంతో బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. తిరిగి ఇంటికెళ్లాల్సిన ప్రయాణీకులు తమ లగేజీ ఎక్కడుందో వెతుక్కునేందుకు ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో బ్యాగులు ఒకేచోట ఉంచడంతో తమ వస్తువుల జాడ కోసం ప్రయాణీకుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎయిర్లైన్స్ యాజమాన్యంపై కొందరు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
News December 5, 2025
వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.
News December 5, 2025
క్షమాపణ కోరిన రంగనాథ్

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్థలంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ ఉల్లంఘించారంటూ సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా కమిషనర్ వెళ్లలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు.


