News September 11, 2025

GST సవరణ.. హోండా బైక్ ధరలు ఎంత తగ్గాయంటే?

image

బైక్‌లపై GST స్లాబును కేంద్రం 28 నుంచి 18శాతానికి తగ్గించనుండడంతో 350, ఆ లోపు సీసీ ఉన్న బైకులపై హోండా కంపెనీ ధరలు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.18వేల వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. దీంతో యాక్టివాపై రూ.7వేలు, డియోపై రూ.7వేలు, యాక్టివా 125పై రూ.8వేలు, హోండా షైన్ 100సీసీపై రూ.5వేలు, హార్నెట్ 2.0పై రూ.13వేలు, సీబీ350పై రూ.18,800 వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

Similar News

News March 3, 2026

బోసిపోయిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్.. కేవలం 20 విమానాలే..

image

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ యుద్ధ ప్రభావంతో బోసిపోయింది. మార్చి 2న ‘ఫ్లైట్ రాడార్24’ ట్రాకింగ్ ప్రకారం 20 విమానాలు మాత్రమే ఈ విమానాశ్రయంలో రాకపోకలు సాగించాయి. అందులో 16 టేకాఫ్ కాగా 4 ల్యాండ్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి రోజుకు 1,200కు పైగా విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతాయి. ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే విమానాలకు ఇదే కనెక్టింగ్ పాయింట్.

News March 3, 2026

BPSCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్(BPSCL)15 అసిస్టెంట్ మేనేజర్(బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్ సర్టిఫికెట్ కలిగినవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bpscl.com

News March 3, 2026

అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావొద్దు: సామ్ కరన్

image

T20WC: ఎల్లుండి తమతో జరిగే <<19285865>>సెమీ ఫైనల్‌లో<<>> భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావొద్దని కోరుకుంటున్నట్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తెలిపారు. ‘ఇండియాకు మంచి లైనప్ ఉంది. అయినా మా ప్లాన్స్ మాకున్నాయి. కచ్చితంగా ఈ మ్యాచ్ అద్భుతంగా సాగుతుంది. మాకు ఇండియాలో ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడి పిచ్ కండీషన్స్ బాగా తెలుసు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.