News April 9, 2025

GT భారీ స్కోర్.. RR టార్గెట్ ఎంతంటే?

image

IPL: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217-6 స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించగా, బట్లర్ (36), షారుఖ్ (36) ఫర్వాలేదనిపించారు. RR బౌలర్లలో తీక్షణ, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో రాజస్థాన్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.

Similar News

News November 15, 2025

ముగిసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్

image

సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 189/9 పరుగులకు పరిమితమైంది. గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. KL రాహుల్(39), సుందర్(29) పంత్(27), జడేజా(27) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. SA బౌలర్లలో సిమోన్‌ 4, జాన్‌సెన్‌ 3 వికెట్లు, మహరాజ్, బోష్‌ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియాకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

News November 15, 2025

రెండో రోజు CII సమ్మిట్ ఫొటో గ్యాలరీ

image

AP: విశాఖలో CII సమ్మిట్ రెండోరోజు కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సదస్సు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే అధినేతలకు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలుకుతున్నారు. సమ్మిట్‌లోని పలు స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. యువత కూడా ఉత్సాహంగా హాజరవుతున్నారు.

News November 15, 2025

గిల్ హెల్త్‌పై BCCI అప్‌డేట్

image

ఈడెన్ గార్డెన్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ కేవలం 3 బంతులే ఆడి మెడనొప్పి కారణంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అతని ఆరోగ్య పరిస్థితిపై BCCI అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘శుభ్‌మన్ గిల్‌కు మెడ కండరాలు పట్టేశాయి. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వైద్య నివేదిక వచ్చిన తర్వాత అతను ఈరోజు ఆడతారా.. లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొంది.