News November 24, 2024

జోస్ బట్లర్‌‌ను సొంతం చేసుకున్న GT

image

ఓపెనింగ్ బ్యాటర్, కీపర్ జోస్ బట్లర్‌ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ (GT) సొంతం చేసుకుంది. ఇతని బేస్ ప్రైజ్ రూ.2కోట్లు కాగా, 2024 ఐపీఎల్ సీజన్‌లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనింగ్ చేశారు. హార్డ్ హిట్టింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలరు. బట్లర్ కోసం గుజరాత్, లక్నో జట్లు పోటీ పడ్డాయి.

Similar News

News November 25, 2025

500 దాటిన సౌతాఫ్రికా ఆధిక్యం

image

భార‌త్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా మరింత పట్టు బిగిస్తోంది. ఆ జట్టు ఆధిక్యం 503 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్ చేసిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. క్రీజులో ఉన్న స్టబ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అటు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. జడేజా 3 వికెట్లు పడగొట్టారు.

News November 25, 2025

బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

image

బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. క్రమశిక్షణ, పార్టీ సంస్థాగత సూత్రాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఆదిత్య పాశ్వాన్, షకీలుర్ రెహమాన్, రాజ్‌ కుమార్ శర్మ, రాజ్‌కుమార్ రాజన్, కుందన్ గుప్తా, కాంచన కుమారి, రవి గోల్డెన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ బిహార్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉత్తర్వులిచ్చారు.

News November 25, 2025

మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధాన కాబోయే భర్త

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. 2 రోజుల క్రితం పలాశ్ ఎసిడిటీ, వైరల్ ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో చేరి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని SVR ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పెళ్లి వేళ స్మృతి తండ్రి గుండెపోటుకు గురికావడంతో పలాశ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని ఆయన తల్లి అమిత తెలిపారు. 4 గంటలు ఏడ్చాడని వెల్లడించారు.