News March 17, 2024

గుడివాడ: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అభ్యర్థిగా హేమంత్

image

రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కోరారు. ఆదివారం గుడివాడకు చెందిన న్యాయవాది అల్లూరి హేమంత్ కుమార్‌ను గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లోకి యువత రావడం ఎంతో అవసరం అన్నారు. జిల్లా కో-ఆర్డినేట‌ర్ బి.స‌త్య వ‌సుంధ‌ర‌, లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్ నాయ‌ర్, పాల్గొన్నారు.

Similar News

News January 28, 2026

కృష్ణా: పవన్ కళ్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.

News January 28, 2026

ఉప్పులూరు ఆసుపత్రిలో DMHO ఆకస్మిక తనిఖీ

image

ఉప్పులూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. DMHO యుగంధర్ ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా, ఒక సామాన్యుడిలా ఆసుపత్రికి వచ్చారు. నేరుగా వెయిటింగ్ హాల్‌లోకి వెళ్లి, అక్కడ చంటిబిడ్డతో కూర్చున్న ఒక తల్లి వద్దకు వెళ్లి.. వైద్య సేవలపై అని ఆరా తీశారు. అనంతరం ఆయన లోపలికి వెళ్లి రిజిస్టర్లు, OP రికార్డులు పరిశీలిస్తుండగా, చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.

News January 28, 2026

కృష్ణా: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

వడ్లమన్నాడు పాఠశాలలో బుధవారం సందడి నెలకొంది. కలెక్టర్ బాలాజీ పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఆహారం రుచి, నాణ్యతను పరీక్షించిన కలెక్టర్, విద్యార్థులతో ముచ్చటించి భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంటశాల పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.