News March 18, 2024

గుడ్లూరు: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

మండలంలోని పొట్లూరులో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా ఉండేందుకు కొందరు విద్యుత్ తీగ ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు(53) శనివారం రాత్రి తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా కాలికి కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. దీంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Similar News

News January 30, 2026

పోలీస్ డైరీని ఆవిష్కరించిన ప్రకాశం SP

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ పోలీస్ విధుల నిర్వహణకు సంబంధించిన డైరీని ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తయారుచేసిన డైరీని, పోలీస్ సంక్షేమ సమాచార దీపికను ఎస్పీ ఆవిష్కరించి సిబ్బందికి అందజేశారు. డైరీలో పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమయ్యే అన్ని రకాల సమాచారాన్ని పొందుపరచడంపై ఎస్పీ అభినందనలు తెలిపారు.

News January 30, 2026

ప్రకాశం జేసీగా కల్పనా కుమారి

image

ప్రకాశం జిల్లా జేసీగా కల్పనా కుమారి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబును జేసీ కల్పనకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు.

News January 30, 2026

నేడు ఒంగోలుకు రానున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

image

అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేడు ఒంగోలుకు రానున్నట్లు జిల్లా వైసీపీ కార్యాలయం ప్రకటించింది. నాలుగు గంటలకు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ఏం మాట్లాడతారన్న చర్చ జోరుగా సాగుతోంది.