News March 17, 2024

ఎంపీ బరిలో గూడూరు ఎమ్మెల్యే

image

తిరుపతి ఎంపీ తాను పోటీలో ఉంటానని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఏ పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైన పోటీలో ఉంటానని ఆయన తన అనుచరులకు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీ, జనసేన నాయకులతో కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.

Similar News

News December 23, 2025

వింజమూరు MPP తొలగింపు

image

వింజమూరు మండల అధ్యక్షుడు ఇనగనూరి మోహన్ రెడ్డిని తొలగిస్తూ ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 31వ తేదీన వింజమూరు మండల కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో మండలంలోని 12 మంది ఎంపీటీసీలకు గాను 11 మంది సభ్యులు ఎంపీపీపై అవిశ్వాసానికి ఓటు వేశారు. ఈ మేరకు ఎంపీపీని తొలగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.

News December 23, 2025

TPT: అన్యమతస్థులతో గోవిందరాజస్వామి ఆలయ పనులు..?

image

గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు కాంట్రాక్టర్ జ్యోత్ టెండర్ ద్వారా దక్కించుకుని మరో ఇద్దరు అన్యమతస్థులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే వారికి ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కాగా పనుల్లో అవకతవకలు, విగ్రహాలు తొలగించడంపై హిందూ సంఘాలు ఆరోపణల చేశాయి. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

News December 23, 2025

నెల్లూరు: అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేశాడు.. ‘పాపం పసివారు’

image

తల్లికి వందనం ఇప్పించాలంటూ కలెక్టర్ హిమాన్షు శుక్లాకు పొదలకూరు (M) నల్లపాలనేకి చెందిన కీర్తన, మేరీ బ్లెస్సీ గ్రీవెన్స్‌లో తమ గోడు విన్నవించుకున్నారు. తమకు తల్లిదండ్రులు లేరని తల్లి మూడేళ్ల కిందట చనిపోయిందని, ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తండ్రి వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.