News December 11, 2024
గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికిపైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
Similar News
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో స్థిరంగా చలి ప్రభావం

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రత 13°C లుగా నమోదవుతుంది. జిల్లావ్యాప్తంగా గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 13.8°C, జుక్కల్ 14.6, రామలక్ష్మణపల్లి, బొమ్మన్ దేవిపల్లి, గాంధారి 14.9, నస్రుల్లాబాద్, లచ్చపేట 15.1, రామారెడ్డి 15.2, డోంగ్లి, ఎల్పుగొండ 15.3°C లుగా రికార్డ్ అయ్యాయి.
News November 27, 2025
8,868 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

రైల్వేలో 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు, ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు ఉన్నాయి. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-33ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30ఏళ్లవారు అర్హులు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 27, 2025
APPLY NOW: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో డిగ్రీ అర్హతతో 2,700 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం అప్రెంటిస్లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. NATS/ NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్, DV, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 చెల్లిస్తారు.


