News June 14, 2024
గిన్నిస్ రికార్డు: అత్యంత పొట్టి జంట

ప్రపంచంలోనే అత్యంత పొట్టి దంపతులుగా బ్రెజిల్ వాసులు పౌలో గాబ్రియెల్ ద సిల్వ (31), కట్యుసియా (28)ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. గాబ్రియెల్ ఎత్తు 90.28 cm కాగా, కట్యుసియా 91.13 cms ఉన్నారు. 2006లో తొలిసారి కలుసుకున్న వీరు 15 ఏళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. తాము పొట్టిగా ఉన్నా మనసులు పెద్దవని, ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉందని వారు చెబుతున్నారు.
Similar News
News November 27, 2025
కుళ్లిన పండ్లను తీసుకుని.. : అంధుల క్రికెట్ కెప్టెన్ కన్నీళ్లు

మహిళల అంధుల క్రికెట్ <<18367663>>ప్రపంచకప్ను<<>> ఇటీవల ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కెప్టెన్ దీపిక ఎమోషనల్ అయ్యారు. ‘జనం విసిరేసే కుళ్లిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది నేను, నా తోబుట్టువులు తినేవాళ్లం. మా ఇంట్లోనే కాదు ప్రతి ప్లేయర్ ఇంట్లో రోజుకు ఒకపూట భోజనం దొరకడం కూడా కష్టం. ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.