News December 13, 2024

గుకేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ

image

18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుతమైన విజయం అందుకున్నందుకు తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని చిరంజీవి ట్వీట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసినందుకు శుభాకాంక్షలు అని డైరెక్టర్ రాజమౌళి, మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలి గ్రాండ్ సెల్యూట్ అంటూ హీరో ఎన్టీఆర్, తదితరులు గుకేశ్‌ను అభినందించారు.

Similar News

News January 22, 2026

విశాఖలో టీ20.. రేపట్నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

image

AP: విశాఖలో జనవరి 28న భారత్-న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను రేపట్నుంచి ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. సా.5 గంటల నుంచి ‘డిస్ట్రిక్ట్’ యాప్‌లో టికెట్స్ అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. 5 టీ20ల సిరీస్‌లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి 1-0తో లీడ్‌లోకి వెళ్లింది.

News January 22, 2026

మాపై అధిక పన్నులు వేయండి.. బిలియనీర్ల లేఖ

image

తమపై అధిక పన్నులు వేయాలంటూ 24 దేశాలకు చెందిన కుబేరులు దావోస్‌లో రిలీజ్ చేసిన లేఖ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘టైమ్ టు విన్.. వియ్ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్. లీడర్స్ ఎట్ దావోస్ టాక్స్ ది సూపర్ రిచ్’ అనే హెడ్డింగ్‌తో లేఖ రాశారు. దీనిపై 400 మంది సూపర్ రిచ్ పీపుల్ సంతకాలు చేశారు. పేదలు, అత్యంత సంపన్నుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించడానికి తమలాంటి వారిపై అధిక పన్నులు వేయాలని కోరారు.

News January 22, 2026

బెండ, టమాటా, వంగ పంటల్లో తెగుళ్ల నివారణ

image

ఈ సీజన్‌లో కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.