News May 22, 2024
నైజీరియాలో సాయుధమూకల కాల్పులు.. 40 మంది మృతి

నైజీరియాలోని పీట్లా రాష్ట్రంలో సాయుధమూకలు నరమేధం సృష్టించాయి. వాసే జిల్లాలోని జురాక్ మైనింగ్ గ్రామంపై విరుచుకుపడి కాల్పులు జరపడంతో పాటు ఇళ్లను తగులబెట్టారు. ఈ ఘటనలో 40 మంది మృతి చెందారు. కాగా గనులకు ప్రసిద్ధి చెందిన పీట్లా రాష్ట్రంలో వనరులపై ఆధిపత్యం కోసం తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గ్రామాలపై దాడులు చేసి దోచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ల దాడిలో వేల మంది చనిపోయారు.
Similar News
News October 18, 2025
కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు

TG: జిల్లా–కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. వయసు 18-30 ఏళ్లు. డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలకు <
News October 18, 2025
కల్తీ మద్యం కేసు: ప్రధాన నిందితుడితో జోగి రమేశ్ ఫొటోలు!

AP: కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేశ్ కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. ఓ వేడుకలో వీరు పక్కపక్కనే కూర్చున్నారు. కాగా జనార్దన్‌తో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రమేశ్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు రమేశ్ ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారు చేశామని జనార్దన్ వెల్లడించడం గమనార్హం.
News October 18, 2025
‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.