News October 26, 2024
సిద్ధిఖీ హత్యకు పాకిస్థాన్ నుంచి తుపాకులు

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు 4 తుపాకులు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. వాటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్ సాయంతో తుపాకులను సరిహద్దులు దాటించినట్లు తెలిపారు. కాగా అక్టోబర్ 12న ముంబైలో సిద్ధిఖీని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో 14 మంది అరెస్ట్ కాగా ముగ్గురు పరారీలో ఉన్నారు.
Similar News
News January 23, 2026
వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
News January 23, 2026
వసంత పంచమి పూజా విధానం

పూజా మందిరాన్ని శుభ్రపరిచి పీటపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమతో అలంకరించాలి. 9 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం శుభప్రదం. మల్లెలు, జాజి పూలతో అర్చన చేస్తూ సరస్వతి అష్టోత్తర శతనామాలు పఠించాలి. పాలు, పటిక బెల్లం, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. పూజానంతరం ప్రసాదాన్ని పిల్లలకు పంచడం ద్వారా విద్యా బుద్ధులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.
News January 23, 2026
కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.


