News March 18, 2024
గుంటూరు: విద్యార్థులకు RTCలో ఉచిత ప్రయాణం

నేటినుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రకటించింది. బస్సులో పరీక్షా కేంద్రానికి రాకపోకలు సాగించే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ప్రజా రవాణా అధికారి నర్రా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.
Similar News
News January 24, 2026
గుంటూరులో రేపు 10k వాక్

గుంటూరు నగరంలో ఆదివారం 17వ 10k వాక్ ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ఉదయం 6 గంటలకు రింగ్ రోడ్డులోని ఇండియన్ స్ర్పింగ్స్ స్కూల్ వద్ద నుంచి వాక్ ప్రారంభం అవుతోంది. సినీ నటులు రాజేంద్రప్రసాద్, కామ్నా జఠ్మలానీ, హాస్యనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని అలరించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.
News January 24, 2026
అమరావతిలో గణతంత్ర వేడుకల రిహార్సల్స్

అమరావతి రాజధానిలో గణతంత్ర దినోత్సవ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ శనివారం అట్టహాసంగా జరిగాయి. సీఎస్ శ్యామలరావు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ కవాతును పర్యవేక్షించారు. పోలీస్, ఆర్మీ, ఎన్సీసీ బలగాల విన్యాసాలు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనవరి 26న వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.
News January 24, 2026
అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన DGP

అమరావతి ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడ్డాక రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు ఆ ప్రాంతంలో ప్రాక్టీస్ పెరేడ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, పార్కింగ్, ఇతర విషయాల గురించి స్థానిక అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.


