News March 17, 2024
గుంటూరు: ‘ఈ వృద్ధున్ని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి’

ఒక వృద్ధుడు మృతి చెందిన ఘటనపై ఆదివారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అన్వర్ భాషా తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 12వ తేదీన 50 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. అతని పేరు వివరాలు తెలియలేదని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వృద్ధుడి గురించి తెలిసిన వాళ్ళు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.
Similar News
News April 2, 2025
తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.
News April 2, 2025
వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.
News April 2, 2025
GNT: ఉద్యోగాల జాబితా విడుదల

గుంటూరు DMHO కార్యాలయం పరిధిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు DMHO విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. DEO, LGS, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ లిస్టును guntur.ap.gov.in లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ROR ప్రకారం లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.