News December 26, 2024

మళ్లీ రిలీజవుతున్న ‘గుంటూరు కారం’

image

మహేశ్ బాబు గత మూవీ ‘గుంటూరు కారం’ అంతంతమాత్రంగానే ఆడింది. సోషల్ మీడియాలో మాత్రం మూవీ గురించి మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఆ సినిమాను డిసెంబరు 31న పరిమిత స్క్రీన్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈసారి మాత్రం సీట్లన్నీ చకాచకా నిండిపోతుండటం విశేషం. ఈ ఆదరణ కొనసాగితే స్క్రీన్ల సంఖ్యను మరింత పెంచాలని మూవీ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 14, 2025

308 అప్రెంటిస్‌లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 308 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. అభ్యర్థుల వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in/

News November 14, 2025

ఎలాంటి పాడి పశువులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి?

image

గేదె పాలుకు ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటే గేదెలతో, ఆవు పాలకు ఎక్కువ డిమాండ్ ఉంటే సంకర జాతి ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి. పాల సేకరణ కేంద్రాలు ఉండే ప్రాంతాలలో సంకర జాతి ఆవులు లేక ముర్రా జాతి గేదెలతో ఫారాన్ని ప్రారంభించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పచ్చిమేత వనరులు, మంచి యాజమాన్యం ఉంటే హోలిస్టీన్ ఫ్రీజియన్ సంకర జాతి ఆవులతో, సాధారణమైన మేత వనరులుంటే జెర్సీ సంకర జాతి ఆవులతో ఫామ్ ప్రారంభించాలి.

News November 14, 2025

బీట్‌రూట్ క్యూబ్స్‌తో మెరిసే చర్మం

image

బీట్‌రూట్‌‌ను నేరుగా ముఖానికి రుద్దడం కంటే, దాన్ని ఐస్ క్యూబ్స్ రూపంలో తయారుచేసి వాడితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. బీట్‌రూట్‌ను కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. రసం తీసి అందులో పాల మీగడ, కలబంద, తేనె కలిపి ఐస్ క్యూబ్ ట్రేలో వేసి నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. వీటిని డైలీ ముఖానికి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి చర్మానికి మెరుపొస్తుందంటున్నారు నిపుణులు. మసాజ్ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి.