News March 18, 2024
గుంటూరు: నలుగురు మహిళలకు MLA టికెట్లు

వైసీపీ ప్రకటించిన ఉమ్మడి గుంటూరు జిల్లా MLA అభ్యర్థుల జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. గుంటూరు వెస్ట్- విడదల రజిని.. గుంటూరు ఈస్ట్- నూరి ఫాతిమా.. తాడికొండ- మేకతోటి సుచరిత.. మంగళగిరి- మురుగుడు లావణ్యలకు టికెట్లు కేటాయించారు. రజిని చిలకలూరి పేట నుంచి గుంటూరుకు, సుచరిత ప్రత్తిపాడు నుంచి తాడికొండకు మార్చారు. లావణ్య, నూరిఫాతిమా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
Similar News
News April 1, 2026
GNT: ఈ ప్రాంతాల్లోనే పెరిగిన వార్డుల సంఖ్య

@తెనాలి ప్రస్తుతం 40 వార్డులు ఉండగా 52కు పెరిగాయి
@రేపల్లె ప్రస్తుతం 28 వార్డులు ఉండగా -36కు పెరిగాయి
@మాచర్ల ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@సత్తెనపల్లి ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@వినుకొండ ప్రస్తుతం 32 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@గురజాల ప్రస్తుతం 20 వార్డులు ఉండగా 23కు పెరిగాయి
News April 1, 2026
ఉమ్మడి గుంటూరుకు వైద్యుల నియామక ఉత్తర్వులు

రాష్ట్రవ్యాప్తంగా 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాల వారీగా పంపిణీలో పల్నాడు జిల్లాకు 26 మంది, గుంటూరు జిల్లాకు 14 మంది వైద్యులను కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో సేవలందించేందుకు వీరిని నియమించగా, 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని సూచించారు. ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.