News April 12, 2024

టీడీపీలోకి గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్

image

AP: గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగలనుంది. జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేశ్ టీడీపీలో చేరనున్నారు. కొల్లూరులో ఇవాళ జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తాడికొండ టికెట్ దక్కకపోవడంతో వీరు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త సురేశ్ హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలు, అనాథలు, అస్వస్థతతో ఉన్న వారికి సేవ చేస్తుంటారు.

Similar News

News April 1, 2026

KNR: వర్సిటీలో అర్బన్ నక్సలైట్ల అలజడి.. వీసీకి వినతి

image

కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ పీజీ, పరిశోధక విద్యార్థుల క్యాంపస్‌లో అర్బన్ నక్సలైట్లు తిష్ట వేశారనే వార్తలతో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ప్లేస్‌మెంట్లు ప్రభావితమవుతాయని పలువురు విద్యార్థులు వీసీకి బుధవారం వినతిపత్రం అందజేశారు. అనుమానితుల అడ్మిషన్లు రద్దు చేసి, సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే యూనివర్సిటీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

News April 1, 2026

రాష్ట్రంలో ‘పారాక్వాట్’పై తాత్కాలిక నిషేధం

image

TG: అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ గడ్డిమందు విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీనిపై కేంద్రం శాశ్వత నిషేధం విధించాలని అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసింది.

News April 1, 2026

‘ఆయా షేర్’.. నాని ఊర మాస్ లుక్!

image

నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా ‘ప్యారడైజ్’ కోసం చేసిన మేకోవర్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ చిత్రం కోసం ఆయన కండలు తిరిగేలా బాడీని బిల్డ్ చేశారు. తాజాగా జిమ్‌లో కసరత్తు సందర్భంగా దిగిన ఫొటోను ఆయన షేర్ చేయగా వైరలవుతోంది. నాని మాస్ లుక్ చూసి అభిమానులు ‘ఆయా షేర్’ అని పేర్కొంటూ ఆయన డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్యారడైజ్ మూవీ ఆగస్టు 21న విడుదలవనుంది.