News September 22, 2025
రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి: కొండపల్లి

AP:సమాజంలోని దురాచారాలను తన రచనలతో మార్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 150 ఏళ్లైనా ఆయన రచనలు, సాహిత్యం ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. గురజాడ జయంతి సందర్భంగా VZMలో ఆయన ఇంటిని సందర్శించిన మంత్రి, MP కలిశెట్టి దాని ఆధునికీకరణ, గ్రంథాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు.
Similar News
News September 22, 2025
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News September 22, 2025
మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..

పసుపు రాసుకోవడానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యకారణాలున్నాయి. దీన్ని పూజల్లో, ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు, ముఖానికి రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్లనొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది. అందుకే మహిళలు దీన్ని రాసుకుంటారు.
News September 22, 2025
వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.