News November 12, 2024

సచిన్, కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గుర్బాజ్

image

బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో సెంచరీ చేసిన అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. వన్డేల్లో అతి తక్కువ వయసు(22Y 349D)లో 8 సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. ఈ క్రమంలో సచిన్(22Y 357D), కోహ్లీ(23Y 27D)లను అధిగమించారు. సౌతాఫ్రికా క్రికెటర్ డికాక్ 22Y 312Dలోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. కాగా మూడో వన్డేలో గెలిచిన అఫ్గాన్ 2-1తో సిరీస్ గెలుచుకుంది.

Similar News

News December 1, 2025

వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

image

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News December 1, 2025

₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

image

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.