News March 17, 2024
గుర్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

మండలంలోని జమ్ము గ్రామంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని మృత దేహం లభ్యమయిందని రైల్వే హెచ్సీ చక్రధర్ ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 50ఏళ్లు ఉంటుందన్నారు. జేబులో హౌరా నుంచి విజయవాడకు వెళ్తున్నట్లు టికెట్ ఉందన్నారు. బహుశా ట్రైన్ నుంచి జారి పడి 3రోజుల కిందట మరణించి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి పీహెచ్సీకి తరలించామని తెలియజేశారు.
Similar News
News November 10, 2025
గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.
News November 10, 2025
వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలి: ASP

ప్రజల ఫిర్యాదులను చట్టపరిధిలోని తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 42 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ, ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఫిర్యాదులను పరిశీలించి 7రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆమె ఆదేశించారు.
News November 10, 2025
విజయనగరం కలెక్టర్ ఆఫీసుకి 178 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 178 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 63 రెవెన్యూ, 29 డీఆర్డీఏ, 20 GSW విభాగాలకు సంబంధించినవని తెలిపారు. ప్రతి దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని, పరిష్కారామయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.


