News August 5, 2024

గురువు భుజాన సేదతీరుతున్న ఛాంపియన్

image

ఒలింపిక్స్‌లో దేశానికి 2 పతకాల్ని సాధించిపెట్టారు మను భాకర్. త్రుటిలో తప్పింది కానీ మూడోది కూడా వచ్చేదే. ఇన్నాళ్లుగా ఈ టోర్నీ కోసం శ్రమించిన మను ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. తన గురువు జస్‌పాల్ రాణా భుజంపై ఆమె తలవాల్చి రిలాక్స్ అవుతున్న ఫొటో వైరల్ అవుతోంది. గురుశిష్యుల్లా కాక తండ్రీబిడ్డల్లా ఉన్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. వచ్చే 3 నెలల పాటు మను విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 27, 2026

కరువుకు మామిళ్లు, కాలానికి నేరేళ్లు

image

సాధారణంగా వర్షాలు సరిగా కురవక, ఎండలు ఎక్కువగా ఉండి కరవు పరిస్థితులు ఉన్నప్పుడు మామిడి చెట్లు విపరీతంగా కాస్తాయి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ మామిడి పండ్ల దిగుబడి, తీపి పెరుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి, వాతావరణం చల్లబడినప్పుడు నేరేడు పండ్లు పుష్కలం వస్తాయి. కరవు సమయంలో ఆహారం కోసం మామిడి పండ్లను, వానాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లను ప్రకృతి మనకు ప్రసాదిస్తుందని ఈ సామెత అర్థం.

News January 27, 2026

రామకృష్ణ తీర్థం వెనకున్న పురాణ గాథ

image

స్కంద పురాణం ప్రకారం.. పూర్వం రామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశారు. నిత్య స్నానాదుల కోసం ఈ తీర్థాన్ని నిర్మించుకున్నారు. అక్కడే నివసిస్తూ మహావిష్ణువును ధ్యానించారు. మహర్షి భక్తికి మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు ముక్తిని ప్రసాదించారు. అందుకే ఈ తీర్థానికి ఆయన పేరొచ్చింది. ఈ ప్రదేశంలో రాముడు, కృష్ణుడి విగ్రహాలుంటాయి. అందుకే దీన్ని ‘రామకృష్ణ తీర్థం’ అంటారని మరో గాథ.

News January 27, 2026

రామకృష్ణ తీర్థం ఎక్కడ, ఎలా ఉంటుందంటే..

image

రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 10km దూరంలో ఉంటుంది. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు. యాత్రికులు ముందుగా తిరుమల నుంచి బస్సు/సొంత వాహనాల్లో పాపవినాశనం చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 6KM దూరంలో ఈ తీర్థం ఉంటుంది. రాళ్లు, రప్పలు, నీటి వాగుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది. ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, అతి రమణీయంగా ఉంటుంది.