News March 29, 2025

గురుకుల ఫలితాలు విడుదల

image

TG: రాష్ట్రంలోని SC, ST, BC గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష(స్పెషల్ కేటగిరీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విభాగంలో 13,927 మంది విద్యార్థులు పరీక్ష రాయగా తొలి దశలో 1,944 మంది సీట్లు సాధించారని అధికారులు తెలిపారు. అలాగే ఐదు నుంచి 9వ తరగతి వరకు పరీక్ష రాసిన విద్యార్థుల మొదటి దశ మెరిట్ లిస్టును కూడా రిలీజ్ చేసినట్లు చెప్పారు.
వెబ్‌సైట్: https://www.tgswreis.telangana.gov.in/

Similar News

News November 25, 2025

ములుగు: 7069 మహిళా సంఘాలు.. 68,532 మంది సభ్యులు

image

ములుగు జిల్లాలో 9 మండల సమాఖ్యల పరిధిలో 68,532 మంది మహిళలు పొదుపు సంఘాల సభ్యులుగా నమోదై ఉన్నారు. మొత్తం 341 గ్రామైక్య సంఘాలు ఉండగా వాటి పరిధిలో 7069 స్వయం సహాయక సంఘాలు నిర్మాణమయ్యాయి. ఈ ఏడాది కొత్తగా 522 సంఘాలను ఏర్పాటు చేశారు. వీటిలో 193స్వయం సహాయక సంఘాలు, 139వృద్ధుల సంఘాలు, 112 దివ్యాంగుల సంఘాలు, 78కిశోర బాలికల సంఘాలను ఉన్నాయి. వానాకాలం వడ్ల సేకరణ కోసం 60 కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకు ఇచ్చారు.

News November 25, 2025

బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు?: శివాజీ

image

సినిమా టికెట్ ధరల పెంపుపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇండస్ట్రీలో 95శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు. ఇక్కడ అందరికీ లగ్జరీ లైఫ్ అంటూ ఉండదు. మూవీ టికెట్ రేట్లు పెరిగాయి అంటున్నారు. సంక్రాంతి టైమ్‌లో బస్సు ఛార్జీలు 3 రెట్లు పెంచుతారు. అప్పుడు ఎందుకు ఎవరూ మాట్లాడరు? అదే మూవీ టికెట్ రేటు పెరగ్గానే విలన్‌లా చూస్తారు. ఇది కరెక్ట్ కాదు’ అని శివాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మీ కామెంట్?

News November 25, 2025

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.