News November 27, 2024

Nov 30 నుంచి ‘గురుకుల బాట’: BRS

image

TG: నవంబర్ 30-డిసెంబర్ 7 మధ్య రాష్ట్రవ్యాప్తంగా BRS ‘గురుకుల బాట’ నిర్వహించనుంది. విద్యార్థులకు అందించే భోజనాన్ని MLA, MP, MLCలు, పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించనున్నారు. ఇటీవల తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతున్న నేపథ్యంలో BRS ఈ నిర్ణయం తీసుకుంది. RSP ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేసి, నివేదిక అంశాలను సభలో లేవనెత్తనుంది.

Similar News

News January 6, 2026

హిల్ట్ పాలసీ లీక్ కేసులో నలుగురు అధికారులు!

image

TG: హిల్ట్ పాలసీ సమాచారాన్ని ఇటీవల BRSకు లీక్ చేసిన వ్యవహారంలో ఇద్దరు IASలతో సహా నలుగురు అధికారుల పాత్ర ఉందని విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు CMOకు నివేదిక అందించగా, ఇందులో తన పాత్ర లేదని CMకు ఓ IAS వివరణ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TGIIC)కి చెందిన ఇద్దరు అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుండగా, ఓ IASను బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

News January 6, 2026

SC ఉత్తర్వులపై విపక్షాల ప్రశ్నలు

image

ఢిల్లీ అల్లర్ల కేసు(2020)లో సామాజిక కార్యకర్తలు ఉమర్, షర్జీల్‌లకు SC బెయిల్ నిరాకరించడాన్ని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. మహిళలపై అత్యాచారం చేసిన కేసు(2017)లో గుర్మీత్ సింగ్‌కు 15వ సారి పెరోల్‌పై కోర్టు విడుదల చేసిందని గుర్తుచేశాయి. విచారణ లేకుండా 5 ఏళ్లు నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని MA బేబీ(CPM) వ్యాఖ్యానించారు. బెయిల్ నిరాకరణ ద్వంద్వ నీతిని బహిర్గత పరుస్తోందని D.రాజా(CPI) అన్నారు.

News January 6, 2026

జ్యోతి యర్రాజీని కలిసిన మంత్రి లోకేశ్.. ₹30.35 లక్షల సాయం

image

AP: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్స్‌షిప్ 100M హర్డిల్స్‌లో స్వర్ణ విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీని కలవడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆమె ధైర్యం, సంకల్పం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో సన్నద్ధతకు ₹30.35L సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఒలింపిక్ కలను సాకారం చేసే దిశలో ఆమెకు అండగా నిలుస్తామన్నారు.