News January 28, 2025
గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు: సీపీ

TG: మీర్‌పేటలో గురుమూర్తి భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడని రాచకొండ CP సుధీర్‌బాబు వెల్లడించారు. ఇలాంటి కేసు ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు. గురుమూర్తిలో ఎటువంటి పశ్చాత్తాపం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా భార్యతో గొడవపడి గోడకేసి కొట్టి, గొంతునులిమి చంపాడని తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పిల్లలను తీసుకొచ్చి ఇంట్లోనే పడుకున్నట్లు వివరించారు.
Similar News
News December 3, 2025
త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.
News December 3, 2025
ఈ విషయం మీకు తెలుసా?

చెప్పులు, బూట్లు కొనేటప్పుడు చాలా మంది పొడవు నంబర్‌ను మాత్రమే చూస్తారు. అయితే షూలకు పొడవుతో పాటు వెడల్పును సూచించే ప్రత్యేక నంబర్లు (ఉదాహరణకు, B,AA, EE) కూడా ఉంటాయి. ఇది తెలియక కొందరు కొత్తవి ఇరుకుగానే ఉంటాయని భావించి మౌనంగా నొప్పిని భరిస్తుంటారు. దీనివల్ల పాదాలు, అరికాళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇకనుంచి షూ కొనే సమయంలో Width, Length చూడాలంటున్నారు. దీనికోసం పైనున్న ఫొటో చూడండి.
News December 3, 2025
మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.


