News November 12, 2024
అసెంబ్లీ చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు

AP: శాసన సభ, మండలిలో చీఫ్ విప్‌లు, విప్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. అసెంబ్లీలో 15 మందిని విప్‌లుగా నియమించింది. అసెంబ్లీ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ ఉండనున్నారు.
Similar News
News November 23, 2025
అక్రమ లేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు గడువు పెంపు

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమలేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు NMC అధికారులు మరోసారి అవకాశం కల్పించారు. BPS పథకంలో భాగంగా 1985 నుంచి 2025 ఆగస్టు వరకు అనధికారికంగా, అనుమతికి మించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేందుకు వచ్చే ఏడాది మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1113, 7981651881 నంబర్లను సంప్రదించాలని కమిషనర్ నందన్ కోరారు.
News November 23, 2025
అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.
News November 23, 2025
కుజ దోషం అంటే ఏంటి?

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


