News February 25, 2025
జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీ క్యాడర్ అసంతృప్తి!

AP: జీవీరెడ్డి <<15567607>>రాజీనామా<<>> టీడీపీలో కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన ఆయనకు పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని చెబుతున్నారు. మంచి సబ్జెక్ట్, యువనేత దూరం అవడం పార్టీకి నష్టం తెస్తుందని అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు క్యాడర్ కంటే అధికారులకే పెద్దపీట వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవీరెడ్డిని తిరిగి టీడీపీలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News February 25, 2025
ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News February 25, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్

నిన్న నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ ఇవాళ పుంజుకుంటోంది. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 74,571 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,584 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, హిందాల్కో, కోల్ ఇండియా, లార్సెన్ నష్టాల్లో ఉన్నాయి.
News February 25, 2025
అసెంబ్లీకి వెళ్లేది లేదన్న జగన్.. మీరేమంటారు?

YS జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదన్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సరైన వేదిక అని, ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో 10% సీట్లు లేని YCPకి ఎలా ఇస్తారని కూటమి శ్రేణులు నిలదీస్తున్నాయి. అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని YCP అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?