News August 2, 2024

GVL ట్వీట్‌పై స్పందించిన నారా లోకేశ్

image

బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ట్వీట్‌పై మంత్రి లోకేశ్ స్పందించారు. పోలీసులు మితిమీరి వ్యవహరించినందుకు లోకేశ్ క్షమాపణ చెప్పడం, విద్యా శాఖలో ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం పట్ల GVL లోకేశ్‌ను అభినందించారు. దీనికి ప్రతిగా లోకేశ్ ‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతుంటాయి. తప్పులు జరగకుండా మీలాంటి వారి సహకారంతో మరిన్ని మంచి పనులు చేయడమే నా లక్ష్యం‘ అని ట్విట్ చేశారు.

Similar News

News September 14, 2024

లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ

image

నేడు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కక్షిదారులు కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. చెక్ బౌన్స్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు ఉన్న కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News September 13, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.4 కోట్ల విరాళం

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. రూ.4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం సచివాలయంలో చందబ్రాబును కలిసి అందించారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు, రామకృష్ణ తనయుడు సాకేత్ రామ్ చెక్కు అందజేసిన వారిలో ఉన్నారు.

News September 13, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం

image

రాష్ట్ర సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి, తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, ఎండీ తులసి యోగిశ్ చంద్ర కోటి రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు. దీంతో పాటు తులసి గ్రూప్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5.43 లక్షలను సంస్థ జనరల్ మేనేజర్ పచ్చా వాసుదేవ్, చంద్రబాబుకు అందజేశారు.