News August 2, 2024
GVL ట్వీట్‌పై స్పందించిన నారా లోకేశ్
బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ట్వీట్‌పై మంత్రి లోకేశ్ స్పందించారు. పోలీసులు మితిమీరి వ్యవహరించినందుకు లోకేశ్ క్షమాపణ చెప్పడం, విద్యా శాఖలో ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం పట్ల GVL లోకేశ్‌ను అభినందించారు. దీనికి ప్రతిగా లోకేశ్ ‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతుంటాయి. తప్పులు జరగకుండా మీలాంటి వారి సహకారంతో మరిన్ని మంచి పనులు చేయడమే నా లక్ష్యం‘ అని ట్విట్ చేశారు.
Similar News
News November 29, 2024
ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా
ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.
News November 29, 2024
చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 29, 2024
నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
నేటి నుంచి రానున్న 4 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.