News February 2, 2025
GVMCలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తాత్కాలిక రద్దు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా GVMCలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 13, 2025
విశాఖ: కాలేజీ పైనుంచి దూకి విద్యార్థి సూసైడ్

విశాఖలో బుధవారం అర్ధరాత్రి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రం రాయపూర్‌కి చెందిన చంద్రవంశీ (17) బోరవాణి పాలెంలోని నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. అర్ధరాత్రి కాలేజీ 5వ అంతస్థు నుంచి దూకి చంద్రవంశీ మృతి చెందాడు. మృతదేహాన్ని KGHకి తరలించారు. పీఎంపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. CITU నాయకులు గురువారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
షీలా నగర్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి

గాజువాక షీలా నగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడు తుంగ్లాం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. స్కూటీపై వెళ్తున్న ప్రవీణ్ రోడ్డుపై విగత జీవిగా పడిఉన్నాడు. ఘటనా స్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందా.. ఏదైనా వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
News February 13, 2025
వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా కన్నబాబు

వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం కమిటీ ప్రకటన జారీ చేసింది. వైసీపీ హయాంలో కన్నబాబు మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జిగా కూడా కొనసాగారు. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కన్నబాబు నియామకం చేపట్టారు.