News November 23, 2025

GVMCలో అవినీతి ‘ప్లానింగ్’..!(1/2)

image

త్వరలో 10జోన్లుగా రూపాంతరం చెందనున్న GVMCలో(ప్రస్తుతం 8) భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఆన్‌లైన్‌లో <<18364917>>అనుమతులు<<>> ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుమతున్నీ ఉన్నా అదనంగా కొర్రీలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఒక భవనానికి అనుమతి కావాలంటే రూ.లక్షల్లో ముడుపులు అడుగుతున్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు నిఘా పెట్టాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Similar News

News November 23, 2025

ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

image

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’‌కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.

News November 23, 2025

వికారాబాద్: మార్వాడీల మాయాజాలం.. బంగారంతో మాయం.!

image

మార్వాడీల మాయాజాలం ప్రజల బంగారంతో మాయమైపోతున్నారు. స్థానిక నాయకుల అందండలతో మార్వాడీ వ్యాపారస్తులు తాకట్టు పెట్టిన బంగారం తీసుకొని పారిపోతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కుల్కచర్ల మండలంలో ఇప్పటివరకు మార్వాడీలు ప్రజలను నమ్మించి బంగారంతో ఉడాయించారు. మార్వాడీలు ప్రజలను తరుచూ మోసం చేసి పారిపోతున్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అండగా ఉండటంతో మార్వాడీలు దోచుకుంటున్నారన్నారు.

News November 23, 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రీవెన్స్ డే

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.