News December 7, 2025

GVMCలో గ్రామాల విలీనానికి ప్రభుత్వం కసరత్తు..

image

GVMC విస్తరణకు మరో అడుగు పడింది. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లోని 64 గ్రామ పంచాయతీలు.. పెందుర్తి మండలంలోని 15 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. దీనికి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ వ్యవహారాల విభాగాన్ని పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించింది. ఈ గ్రామాలన్నీ విలీనం అయితే జిల్లా మొత్తం GVMC పరిధిలోకి వెళ్లిపోతుంది.

Similar News

News December 14, 2025

BREAKING: మెదక్‌లో తొలి ఫలితం

image

మెదక్ మండలం బాలానగర్ సర్పంచ్‌గా బెండ వీణ విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వీణ సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. వీణ మెదక్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.

News December 14, 2025

శివాజీ నగర్‌‌ సర్పంచ్‌గా సుక్కినే నాగరాజు

image

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. దుగ్గొండి మండలం శివాజీ నగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుక్కినే నాగరాజు 92 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకొంటున్నారు.

News December 14, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

బిజినేపల్లి మండలంలోని చిన్న పీర్‌ తాండా సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు మునీందర్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నూర్యపై ఆయన 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మునీందర్ నాయక్ గెలుపు పట్ల తాండా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.