News February 2, 2025

GVMCలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తాత్కాలిక రద్దు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా GVMCలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News February 2, 2025

GVMC టీడీఆర్‌లలో భారీ కుంభకోణం: మూర్తి యాదవ్

image

జీవిఎంసీలో టీడీఆర్‌ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో వందల కోట్లు అక్రమ టీడీఆర్‌లు పొందిన వారు.. ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కూటమి నేతలను ప్రలోభాలు పెట్టి.. జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.

News February 2, 2025

వాల్తేర్ డివిజన్‌కు విశిష్ట రైలు సేవా పురస్కారం

image

భువనేశ్వర్‌లో జరుగుతున్న రైల్వే 69వ వార్షికోత్సవాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు విశిష్ట రైలు సేవా పురస్కారం లభించింది. ఈమేరకు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ ఈ అవార్డును అందించారు. ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సేవలకు వాల్తేర్ డివిజన్‌కు మరో ఆరు ప్రత్యేక పురస్కారాలు దక్కాయి. అత్యుత్తమ పని తీరు కనబర్చిన 49 మంది సిబ్బందికి పురస్కారాలు అందించారు.

News February 2, 2025

గాజువాకలో యువకుడి సూసైడ్

image

గాజువాకలో విజయనగరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫార్మాసిటీలో పనిచేస్తున్న భాస్కరరావు శ్రీనగర్లో అద్దెకు ఉంటున్నాడు. పక్కింట్లో ఉన్న అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బందువులు దాడి చేసి ఇంట్లో బంధించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాజువాక పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.