News February 2, 2025
GVMC టీడీఆర్‌లలో భారీ కుంభకోణం: మూర్తి యాదవ్

జీవిఎంసీలో టీడీఆర్‌ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో వందల కోట్లు అక్రమ టీడీఆర్‌లు పొందిన వారు.. ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కూటమి నేతలను ప్రలోభాలు పెట్టి.. జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ

కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చింరజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.
News February 19, 2025
విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్

నవ వధువు పారిపోయిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఏలూరు గజ్జలవారి చెరువుకు చెందిన శివనాగ సాయికృష్ణ, విశాఖ కంచరపాలేనికి చెందిన బోడేపు చంద్రహాసినితో జనవరి 31న పెళ్లి జరిగింది. వారం క్రితం బిట్టుబారు సమీపంలో కాపురం ప్రారంభించారు. ఈనెల 16న రాత్రి భర్త నిద్రపోయాక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 4 కాసుల గోల్డ్ చైన్, ఉంగరం, వెండి పట్టీలతో ఆమె పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News February 19, 2025
వైస్ ఛాన్స్‌లర్లుగా ఏయూ ఆచార్యులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నూతన ఉప కులపతులుగా నియమితులయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల విభాగ సీనియర్ ఆచార్యులు ఏ.ప్రసన్నశ్రీ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఏయూలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.రాంజీ మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమింపబడ్డారు.