News December 24, 2025
GVMC కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై కోర్టుకు

విశాఖలో మరోసారి నో-కాన్ఫిడెన్స్ రాజకీయాలు వేడెక్కాయి. GVMCలో అసమ్మతి కార్పొరేటర్లపై అనర్హత వేటు కోరుతూ YCP దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్నికల అధికారి తోసిపుచ్చారు. 26 మందికి నోటీసులు ఇచ్చినా.. ఒక్క సభ్యురాలు మాత్రమే విప్ ఉల్లంఘన పరిధిలోకి వస్తారని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయంటూ YCP ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించనుంది. కాగా.. వచ్చే ఏడాది మార్చితో పాలక మండలి గడువు ముగియనుంది.
Similar News
News December 27, 2025
అల్లు అర్జున్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనపై పోలీసులు <<18684964>>ఛార్జ్‌షీట్<<>> దాఖలు చేయడంపై మరోసారి హీరో అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఏ-11గా పేర్కొనడంతో బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఛార్జ్‌షీట్ అనేది కేసు పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించే నివేదిక. ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అందులో పేర్కొనడంతో బన్నీ అరెస్ట్ ఉండకపోవచ్చు!
News December 27, 2025
VZM: కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో 90, మండల స్థాయిలో 82 పారామీటర్లు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.
News December 27, 2025
రాష్ట్రంలోనే ‘ఉపాధి’ పథకం ప్రారంభం.. CWCలో చర్చ

AP: MGNREGA స్కీమ్ ఏర్పాటై 2026 ఫిబ్రవరి 2కు 20 ఏళ్లు పూర్తి అవుతుంది. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నాటి PM మన్మోహన్, సోనియా దాన్ని ప్రారంభించారు. కాగా NDA ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై వివాదం మొదలైంది. దీనిపై CWC భేటీలో చర్చించినట్లు PCC EX చీఫ్ రుద్రరాజు తెలిపారు. JAN 5 నుంచి చేపట్టే ఉద్యమంలో భాగంగా బండ్లపల్లిలో సభ నిర్వహించాలని, దీనికి రావాలని సోనియాను కోరామని తెలిపారు.


