News March 24, 2025
శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
Similar News
News March 26, 2025
365 రోజుల్లో ‘ది ప్యారడైజ్’

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజున విడుదల కానుంది. ఇంకా 365రోజులు అంటూ నాని ఓ పోస్టర్‌ను Xలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
News March 26, 2025
గర్భిణుల పథకానికి నిధులు ఏవి: సోనియా గాంధీ

గర్భిణులకు ఇచ్చే మాతృత్వ ప్రయోజనాల పథకానికి కేంద్రం పూర్తి నిధులు కేటాయించలేదని ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. ఈ స్కీమ్‌కు రూ.12,000కోట్లు అవసరం కాగా కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. 2022-23లో 68శాతం మంది ఒక విడత డబ్బులు తీసుకోగా ఆ తరువాతి సంవత్సరంలో ఆ సంఖ్య 12శాతానికి తగ్గిందన్నారు. జాతీయ ఆహర భద్రత పథకం కింద కేంద్రం రెండు విడతలలో గర్భిణులకు రూ.6వేలు ఇస్తుంది.
News March 26, 2025
SLBCని పూర్తి చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్

TG: SLBC ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద పనులు ప్రారంభిస్తాం. కాళేశ్వరం డీపీఆర్, నిర్మాణానికి తేడా ఉంది. ఈ విషయంలో NDSA రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.