News November 10, 2024

GWL: అపోహలు వీడి పూర్తి సమాచారం ఇవ్వాలి: డిప్యూటీ సీఎం భట్టి

image

కులగణనపై ప్రజలు అపోహలు విడనాడి కుటుంబ సమగ్ర సమాచారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్‌తో మాట్లాడారు. కులగణనలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్యుమరేటర్లు జాగ్రత్త వహించే విధంగా చూడాలన్నారు. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. ప్రజా ప్రతినిధులను సర్వేలో భాగస్వాములు చేయాలన్నారు.

Similar News

News November 24, 2024

NRPT: జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత ఈ గ్రామంలోనే  

image

NRPT జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత 5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగగా వాహనదారులు, వాకర్లు చలికి ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లాలోని దామర్ గిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామాల్లో ఆదివారం 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 17.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News November 24, 2024

MBNR: 27 నుంచి  సెమిస్టర్-2 ప్రయోగ పరీక్షలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో సైన్స్ & కంప్యూటర్ చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు MVS డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుంచి ప్రయోగ పరీక్షలు (సెమిస్టర్-2) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఫీజు చెల్లించిన రసీదు, గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు.

News November 23, 2024

30న పాలమూరుకు సీఎం రేవంత్ రాక

image

మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30న వస్తున్నట్లుదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లతో మధ్యాహ్నం 12:00 గంటలకు సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.