News January 24, 2025
GWL: అబాండెడ్ వాహనాలకు ఈనెల 30న వేలం పాట

పోలీస్ తనిఖీల్లో పట్టుబడి ఎవరు గుర్తించలేని అబాండెడ్ వాహనాలకు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు పీజేపీ క్యాంపులోని సాయుధ దళ పోలీస్ కార్యాలయం ఆవరణలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గలవారు రూ.200 ఫీజు చెల్లించి ఆధార్ కార్డుతో వేలంపాటలో పాల్గొనాలని సూచించారు. వేలంపాటకు ఒకరోజు ముందు వాహనాలు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
Similar News
News November 25, 2025
హనుమాన్ చాలీసా భావం – 20

దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
ఎంత కష్టమైన పనులైనా హనుమంతుని అనుగ్రహం లభిస్తే అవి సులభంగా మారిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లు, అడ్డంకులు మనకు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ మన ఆత్మవిశ్వాసం, బలానికి ఆంజనేయుడిపై పెట్టుకున్న నమ్మకం తోడైతే.. ఎంతటి కష్టాలనైనా అధిగమించగలమని, పెద్ద ఇబ్బందులను దాటడం కష్టమేం కాదని ఈ హనుమాన్ చరణం వివరిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 25, 2025
తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

AP: తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు.
News November 25, 2025
మెదక్: 49 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుండి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.


