News January 23, 2025
GWL: అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామసభలు: SP

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోందని గద్వాల SP శ్రీనివాసరావు పేర్కొన్నారు. గద్వాల మండలం వీరాపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేస్తారని చెప్పారు. జాబితాలో పేర్లు లేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామసభలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 8, 2025
APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ <
News November 8, 2025
పెందుర్తి: దొంగా-పోలీసు ఆడుదాం అంటూ చంపేసింది

పెందుర్తిలో సొంత అత్తనే కోడలు హత్య చేసిన విషయం <<18232660>>తెలిసిందే<<>>. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన తర్వాత తన కుమార్తె, అత్త కనకమహాలక్ష్మితో కలిసి దొంగా-పోలీసు ఆట ఆడుదామని లలితా దేవి పిలిచింది. అనంతరం అత్త కాళ్లకు తాళ్లు కట్టి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. విచారణకు వచ్చిన పోలీసులకు దేవుడి గదిలో దీపం పడడంతో కాలిపోయినట్లు స్టోరీ అల్లింది. దర్యాప్తు చేయగా.. అసలు నిజం బయటపడింది.
News November 8, 2025
21న సిరిసిల్ల-గోవా స్పెషల్ టూర్

ఆర్టీసీ సిరిసిల్ల డిపో నుంచి ఈనెల 21వ తేదీ శుక్రవారం గోవాకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించనున్నారు. బీదర్, హుమ్నాబాద్, గానుగపూర్, మురుడేశ్వర్, గోకర్ణ, గోవా, పండరీపూర్, తుల్జాపూర్ సందర్శన అనంతరం తిరిగి 24న సిరిసిల్ల చేరుకుంటుంది. పెద్దలకు రూ.3900/-, పిల్లలకు 2750/- చార్జి ఉంటుందని, వసతి భోజన ఖర్చులు ప్రయాణికులు భరించాల్సి ఉంటుందని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.


