News January 23, 2025
GWL: అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామసభలు: SP

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోందని గద్వాల SP శ్రీనివాసరావు పేర్కొన్నారు. గద్వాల మండలం వీరాపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేస్తారని చెప్పారు. జాబితాలో పేర్లు లేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామసభలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 13, 2025
చేగుంట: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.
News February 13, 2025
2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు : SP

దురాజ్ పల్లి గొల్లగట్టు జాతరకు 2వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి 24 గంటల నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు.
News February 13, 2025
10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా: కలెక్టర్

కేజీబీవీ విద్యార్థినులు 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి.. వారితో సెల్ఫీ దిగారు. పదవ తరగతిలో 10-10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.