News January 27, 2025

GWL: ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాడుతాం..!

image

గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పరిసర గ్రామాల రైతులు నర్సింహులు, సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం 5వ రోజు దీక్షా శిబిరం వద్ద ఆయా గ్రామాల మహిళలతో రిలే దీక్షలు చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కంపెనీ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కంపెనీ నిర్మాణం వల్ల తుంగభద్రా నది పరివాహక ప్రాంతం కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.

Similar News

News November 21, 2025

ప్రతీసారి మేడారం జాతరకు ముందే బదిలీలు..!

image

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వసాధారణం అయినప్పటికీ ములుగు జిల్లా విషయంలో మాత్రం ప్రాధాన్యత అంశంగా మారుతోంది. మేడారం మహా జాతరకు ముందే ఉన్నతాధికారులు బదిలీ కావడం చర్చకు దారితీస్తోంది. 2024 జాతరకు నెల ముందు అప్పటి ఎస్పీ సంగ్రామ్ సింగ్ బదిలీ అయ్యారు. ఇప్పుడు జాతరకు రెండు నెలలు ఉందనగా శబరీశ్ బదిలీ అయ్యారు.

News November 21, 2025

పెద్దపల్లి: వ్యవసాయ భూమిగా చూపి.. రూ.5.30 లక్షల రైతు భరోసా స్వాహా

image

పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సర్వే నం.584 వ్యవసాయ భూమిపై విద్యాసంస్థ భవనాలు ఉన్నప్పటికీ, ఆ భూమిని వ్యవసాయంగా చూపించి రూ.5.30 లక్షల రైతు భరోసా నిధులను అక్రమంగా పొందారని రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేష్ పటేల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాసరి పుష్పలత పేరుతో ఉన్న ఈ పట్టాదార్ పాస్‌బుక్‌పై విచారణ చేసి, అక్రమ లబ్ధిని రికవరీ చేయాలని ఆయన కోరారు.

News November 21, 2025

ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ

image

ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ములుగు ఓఎస్డీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌ఛార్జిగా డీఎస్పీ రవీందర్ వ్యవహరిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న అధికారులను నియమించాలని ఉద్దేశంతో శివం ఉపాధ్యాయకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్‌ను నియమించారు.