News January 27, 2025
GWL: ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాడుతాం..!

గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పరిసర గ్రామాల రైతులు నర్సింహులు, సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం 5వ రోజు దీక్షా శిబిరం వద్ద ఆయా గ్రామాల మహిళలతో రిలే దీక్షలు చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కంపెనీ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కంపెనీ నిర్మాణం వల్ల తుంగభద్రా నది పరివాహక ప్రాంతం కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
Similar News
News February 19, 2025
గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. బ్లూ కోర్టు, పెట్రో కార్ సిబ్బంది, 100 డైల్స్ కి తక్షణమే స్పందించాలని కోరారు. ఆయన వెంట సిఐ శ్రీనివాస్, ఎస్ఎస్ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.
News February 19, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.
News February 19, 2025
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని విజయనగరంలో ఆందోళన

ఈనెల 23న జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని విజయనగరంలో అభ్యర్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో తీర్పు వెలువడిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. తక్షణమే పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు నష్టపోతారన్నారు. కేసులన్నీ పరిష్కరించి ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోట జంక్షన్ వరకు ర్యాలీ చేశారు.