News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News October 15, 2025
సిరిసిల్లలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు..15 వాహనాలు సీజ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రవాణా శాఖ అధికారులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. టాక్స్, ఫిట్నెస్, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలపై చర్యలు తీసుకున్నారు. రేడియం స్టిక్కర్లు లేకుంటే ₹2000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగనున్నాయని తెలిపారు.
News October 15, 2025
అనుమతి లేని ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలను నిర్దేశించిన సమయంలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. జిల్లాలో 26 వేల 582 ఆక్వా చెరువులు ఉన్నాయని, వాటికి సంబంధించి చెరువు విస్తీర్ణం, యజమాని పేరు, ఆక్వా సాగు, వినియోగిస్తున్న ఎరువులు, తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. అనుమతి లేని ఆక్వా సాగుపై చర్యలు తీసుకోవాలన్నారు.
News October 15, 2025
రాజన్న అభివృద్ధి పనులు ఆపుతారా? కొనసాగిస్తారా?

సమ్మక్క సారక్క జాతర ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుంది. ఈ సమయంలో అభివృద్ధి పనులు కొనసాగితే భక్తులకు తీవ్ర అకసౌకర్యం ఏర్పడుతుంది. అటు అభివృద్ధి పనులు, ఇటు దర్శనాలు ఒకే సమయంలో జరిగితే లక్షల్లో భక్తులను కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.