News April 3, 2025

GWL: ఈత సరదా ముగ్గురి ప్రాణం తీసింది!

image

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

Similar News

News April 11, 2025

నారాయణపేట: Way2Newsలో వార్త.. ఆ ఊరికి బ్రిడ్జి..!

image

నారాయణపేట జిల్లా మరికల్‌లో నాయీ బ్రాహ్మణ శ్మశాన వాటికకు నిత్యం వాగులో నుంచి నడుచుకుంటూ అంత్యక్రియలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటనపై బుధవారం Way2Newsలో <<16039649>>‘అంతిమయాత్రకు తప్పని తిప్పలు’<<>> అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వెంటనే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులు వంతెన నిర్మించేందుకు కొలతలను తీసుకెళ్లారు.

News April 11, 2025

గద్వాల: పెళ్లి వేడుకలో ఘర్షణ

image

గద్వాల పట్టణంలోని గజ్జెలమ్మ వీధి గోకరమయ్య కట్ట వద్ద రాత్రి పెళ్లి వేడుకలో డీజే పాటల కోసం 2 వర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. పది మందిని అదుపులోకి తీసుకుని, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.

News April 11, 2025

నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై హెచ్చరిక

image

సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

error: Content is protected !!