News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News December 3, 2025
తాండూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB దాడులు (UPDATE)

తాండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.16,500 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ (ఇన్ఛార్జ్ సబ్‌రిజిస్ట్రార్) సాయికుమార్, డాక్యుమెంట్ రైటర్ హరినాథ్ పట్టుబడ్డారు. దాడుల సమయంలో కార్యాలయం షట్టర్‌ను మూసివేసి లోపల విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు షట్టర్లు మోసేసి పరారయ్యారు.
News December 3, 2025
ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ప్రకాశం జిల్లాలోని వివిధ ఉన్నత, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకై కాంట్రాక్టు పద్ధతిన అకడమిక్ ఇన్స్పెక్టర్స్ను నియమిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. అర్హులైనవారు ఈనెల 5లోగా దరఖాస్తులను మీ పరిధిలోని MEOలకు అందజేయాలన్నారు. వివరాలకు స్థానిక MEOలను సంప్రదించాలన్నారు.
News December 3, 2025
చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.


