News January 24, 2025

GWL: ఈనెల 26 నుంచి మరో 4 కొత్త పథకాలు..!

image

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి మరో నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పూడూరులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 21, 2025

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మంది మృతి

image

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జొహన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వాహనాల్లో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెలలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.

News December 21, 2025

‘ఘోస్ట్’ స్కూల్స్.. టాప్‌లో బెంగాల్, TG!

image

మన దేశంలో 5,149 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క స్టూడెంట్ కూడా లేకుండా ‘ఘోస్ట్ స్కూల్స్’గా మారాయి. ఇలాంటి 70% స్కూల్స్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. TGలోని అన్ని జిల్లాల్లోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్ ఉండటం ఆందోళనకరం. ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు, పట్టణ ప్రాంతాలకు వలస, ప్రభుత్వాల ప్రణాళికా లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు లేకపోయినా బడ్జెట్ మాత్రం కేటాయిస్తున్నారు.

News December 21, 2025

NZB: GP ఎన్నికల్లో నకిలీ నోట్లు?

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపుతోంది. వర్ని కెనరా బ్యాంకులో ఓ వ్యక్తి రూ.2.08 లక్షల నకిలీ నోట్లు తీసువచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో ఓ వైన్స్ షాపులో నకిలీ రూ.500 నోట్లు మార్చే ముఠాలోని ఇద్దరు నిందితులపై PD యాక్ట్ నమోదు చేశారు. GP ఎన్నిల్లో దొంగనోట్లు పంపిణీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాట్ టాపిక్‌గా మారింది.