News January 24, 2025

GWL: ఈనెల 26 నుంచి మరో 4 కొత్త పథకాలు..!

image

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి మరో నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పూడూరులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 16, 2025

వరంగల్: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు.

News February 16, 2025

రైలు ఢీకొని అనంత జిల్లా జవాన్ మృతి

image

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రానికి చెందిన BSF జవాన్ లక్ష్మన్న ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని మృతి చెందారు. లక్ష్మన్న తన కుటుంబ సభ్యులతో కలిసి విధుల నిమిత్తం కశ్మీర్‌కు బయలుదేరారు. అయితే ఢిల్లీలో రైలు ఎక్కుతున్న సమయంలో తన భార్య మెడలోని బంగారు చైన్‌ను దొంగ అపహరించి పారిపోతుండగా లక్ష్మన్న పట్టుకోవడానికి ప్రయత్నించారు. అదుపుతప్పి ట్రాక్‌పై పడటంతో మరో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు.

News February 16, 2025

PPM: చెత్త నుంచి సంపద సృష్టిపై సమావేశం

image

పార్వతీపురం జిల్లాలో గృహాల నుంచి సేకరిస్తున్న చెత్త నుంచి సంపద సృష్టిపై దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి వర్మి కంపోస్టులతో సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యత చేపట్టాలన్నారు. శనివారం స్వచ్ఛ దివాస్, ఎంఎస్ఎంఈల సర్వేపై కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

error: Content is protected !!